త‌న స‌మ‌స్య‌లు మాతో చెప్పేవాడే కాదు: ష‌ణ్ముఖ్ పేరెంట్స్‌ | Shanmukh Jaswanth Parents Emotional Comments About Negativity And Trolls On Him, Deets Inside - Sakshi
Sakshi News home page

Shanmukh Jaswanth: స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌.. రెండూ చూశాడు.. ఎన్ని క‌ష్టాలు ప‌డ్డా మాతో..

Feb 25 2024 6:46 PM | Updated on Feb 26 2024 9:10 AM

Shanmukh Jaswanth Parents About Negativity - Sakshi

అంద‌రూ అంద‌రికి న‌చ్చ‌రు. త‌న‌ను ఎందుకంత‌లా విమ‌ర్శిస్తున్నార‌ని బాధేసేది. ష‌ణ్ను క‌న్నా నేనే ఎక్కువ‌గా బాధ‌ప‌డతాను. కానీ అత‌డి ఫ్యాన్స్ చాలా స‌పోర్ట్ చేస్తారు. అది

బిగ్‌బాస్ షో ముందు వ‌ర‌కు ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌కు ఫుల్ క్రేజ్ ఉండేది. వెబ్‌సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోల‌తో జ‌నాల‌ను ఆక‌ట్టుకున్నాడు. దీప్తి సున‌య‌న‌తో ల‌వ్ ట్రాక్‌ న‌డిపాడు. కానీ బిగ్‌బాస్ త‌ర్వాత వ్య‌వ‌హారం బెడిసికొట్టింది. సిరి హ‌న్మంత్‌తో క్లోజ్‌గా ఉండ‌టంతో ష‌ణ్నుపై నెగెటివిటీ పెరిగింది. త‌ర్వాత దీప్తితో బ్రేక‌ప్ కూడా జ‌రిగింది. బిగ్‌బాస్ గేమ్‌లో బ‌లిప‌శువు అయ్యాడు. అనంత‌రం ర్యాష్ డ్రైవింగ్‌తో వార్త‌ల్లోకెక్కాడు. ఈసారి ఏకంగా గంజాయి తాగుతూ ప‌ట్టుబ‌డ్డాడు. దీంతో పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

ష‌ణ్ను క‌న్నా నేనే ఎక్కువ‌గా బాధ‌ప‌డతా..
ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావ్‌.. అంటూ ష‌ణ్నును నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే అత‌డిపై ఎంత ట్రోలింగ్ జ‌రుగుతున్నా పేరెంట్స్‌, అత‌డి అభిమానులు ఎప్పుడూ అండ‌గా నిల‌బ‌డేవారు. ఈ ట్రోలింగ్ వ‌ల్ల ష‌ణ్ను కంటే ఆమె అమ్మ ఎక్కువ బాధ‌ప‌డేది. గ‌తంలో సాక్షికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా కుమారుడిని ఎందుకంత‌లా విమ‌ర్శిస్తున్నార‌ని బాధేసేది. ష‌ణ్ను క‌న్నా నేనే ఎక్కువ‌గా బాధ‌ప‌డతాను. కానీ అత‌డి ఫ్యాన్స్ చాలా స‌పోర్ట్ చేస్తారు. అది సంతోషంగా అనిపించేది. నాకు ఆరోగ్యం బాగోలేన‌ప్పుడు ష‌ణ్ను ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు. నా భ‌ర్త‌, పిల్ల‌ల ప్రేమ వ‌ల్లే అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను.

స‌క్సెస్‌, ఫెయిల్యూర్ రెండూ చూశాడు
ష‌ణ్ను చాలా తెలివైన‌వాడు. త‌ను ఎంతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తాడు. మా ఇష్ట‌ప్ర‌కారం పిల్ల‌లు విద్య పూర్తి చేసి వారికి న‌చ్చిన కెరీర్ ఎంచుకున్నారు. ష‌ణ్ను చాలా ఇబ్బందులుపడి గొప్ప స్థాయికి ఎదిగాడు. స‌క్సెస్‌, ఫెయిల్యూర్ రెండూ చూశాడు. త‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా మాకు చెప్పేవాడు కాదు. మేము ఎక్క‌డ బాధ‌ప‌డతామో అని మా ముందు త‌ను ఇబ్బందులు చెప్పుకునేవాడు కాదు. సొంతంగా ఎద‌గాల‌నుకున్నాడు. త‌న కాళ్ల‌పై త‌ను నిల‌బ‌డ్డాడు. ఇంట్లో ఎప్పుడూ స‌ర‌దాగా న‌వ్వుతూ న‌వ్విస్తూ ఉండేవాడు' అని చెప్పుకొచ్చింది.

చ‌ద‌వండి: ఆడ‌దానికి ఎందుకు స్వాతంత్య్రం? రాత్రి 12 త‌ర్వాత ఏం ప‌ని? త‌ప్పు మ‌న‌వైపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement