Siri Hanmanth First Reaction on Shanmukh- Deepthi Sunaina Breakup - Sakshi
Sakshi News home page

Siri Hanmanth: నా వ‌ల్లే అయితే ఆ బ్రేక‌ప్ ఎప్పుడో జ‌రిగేది: సిరి హ‌న్మంత్

Jan 15 2022 4:10 PM | Updated on Jan 15 2022 5:00 PM

Siri Hanmanth First Reaction on Shanmukh Deepthi Sunaina Breakup - Sakshi

ట్రోలింగ్ చూసి డిప్రెష‌న్‌లోకి వెళ్లాను. దీప్తి బ్రేక‌ప్ అని చెప్ప‌డంతో నా మీద మ‌ళ్లీ నెగెటివిటీ పెరిగింది. నావ‌ల్ల బ్రేక‌ప్ జ‌రిగేంత బ‌ల‌హీన‌మైన ప్రేమ కాదు వాళ్ల‌ది.

బిగ్‌బాస్ ప్రేమ‌జంట మ‌ధ్య చిచ్చు పెట్టింది.. ష‌ణ్ముఖ్‌, దీప్తి బ్రేక‌ప్ చెప్పుకోవ‌డానికి కార‌ణ‌మైంది. మ‌రీ ముఖ్యంగా సిరి వ‌ల్లే వాళ్లిద్ద‌రూ విడిపోయారంటూ సోష‌ల్ మీడియాలో ఆమ‌ను దుమ్మెత్తిపోశారు నెటిజ‌న్లు. త‌న‌కు బ‌య‌ట ఒక ప్రియుడున్న‌ప్ప‌టికీ ఆ విష‌యం మ‌ర్చిపోయి షణ్నూకి హ‌గ్గులు, ముద్దులిస్తూ అతిగా ప్ర‌వ‌ర్తించిందంటూ నానామాట‌ల‌న్నారు. వారి బ్రేక‌ప్‌కు ఆమె కూడా ఓ కార‌ణ‌మే అంటూ విమ‌ర్శించారు. తాజాగా ష‌ణ్నూ-దీప్తి బ్రేక‌ప్‌సై తొలిసారిగా స్పందించింది సిరి.

ఓ ఛాన‌ల్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ షోలో నాకు ష‌ణ్ముఖ్‌, జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్‌. ష‌ణ్నుకు, నాకు మ‌ధ్య ఉన్న‌ది ఫ్రెండ్‌షిప్ మాత్ర‌మే. కాక‌పోతే కొద్దిగా ఎక్కువ‌గా ఎమోష‌న‌ల్ అయ్యాం. దీప్తి సున‌య‌న కూడా నాకు ఫ్రెండే, త‌న‌తో క‌లిసి వ‌ర్క్ కూడా చేశాను. బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఈ ట్రోలింగ్ చూసి డిప్రెష‌న్‌లోకి వెళ్లాను. దాన్నుంచే బ‌య‌ట‌ప‌డే స‌మ‌యానికి దీప్తి బ్రేక‌ప్ అని చెప్ప‌డంతో మ‌ళ్లీ నా మీద నెగెటివిటీ పెరిగింది. నావ‌ల్ల బ్రేక‌ప్ జ‌రిగేంత బ‌ల‌హీన‌మైన ప్రేమ కాదు వాళ్ల‌ది. నా వ‌ల్లే అంటే ఆ బ్రేక‌ప్ ఎప్పుడో జ‌రిగేది. ఒక్క బిగ్‌బాస్ వ‌ల్లే, అది కూడా నా వ‌ల్లే బ్రేక‌ప్ జ‌ర‌గ‌లేదు' అని కుండ బ‌ద్ధ‌లు కొట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement