Shanmukh And Siri, Jessie First Time Met After Bigg Boss, Video Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 5: బిగ్‌బాస్‌ తర్వాత తొలిసారి కలుసుకున్న సిరి, షణ్నూ..ఫోటో వైరల్‌

Dec 25 2021 3:10 PM | Updated on Dec 25 2021 3:38 PM

Shanmukh And Siri, Jessie First Time Met After Bigg Boss, Video Viral - Sakshi

Shanmukh And Siri, Jessie First Time Met After Bigg Boss, Video Viral: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో సిరి-షణ్నూల రిలేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీజన్‌లో ఎక్కువ ట్రోలింగ్‌ బారిన పడ్డ వారిలో వీరు ముందుంటారు. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత ఇద్దరూ ఫ్రెండిష్‌ హగ్గంటూ శృతిమించి ప్రవర్తించడంతో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీంతో టైటిల్‌ రేసులో ఉన్న షణ్నూ రన్నరప్‌గా సరిపెట్టుకోక తప్పలేదు.

ఇక బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వచ్చిన సిరి-షణ్నూ తొలిసారిగా కలుసుకోవడం ఇప్పడు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. బెస్ట్‌ఫ్రెండ్‌ జెస్సీతో కలిసి వైజాగ్‌ రోడ్లపై సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా జెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నెగిటివిటితో బయటకు వచ్చినా బిగ్‌బాస్‌ తర్వాత కూడా ఫ్రెండిప్‌ కంటిన్యూ చేయడం నెటిజన్లు మనసు గెలుచుకుంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement