Shanmukh: 'ఆమెకు నిర్ణయం తీసుకునే హక్కుంది.. నాకోసం చాలా చేసింది'

Shanmukh First Reaction On Breakup With Deepthi Sunaina - Sakshi

Shanmukh First Reaction On Breakup With Deepthi Sunaina: కొత్త సంవత్సరంలో అభిమానులకు షాక్‌ ఇస్తూ దీప్తి సునయన షణ్ముఖ్‌తో బ్రేకప్‌ చెప్పేసుకుంది. 5ఏళ్ల తమ బంధాన్ని తెంచేసుకుంటూ సోషల్‌ మీడియాలో సుధీర్ఘ పోస్ట్‌ పెట్టింది. గత  కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ దీప్తి సునయన మా దారులు వేరంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. కానీ షణ్ముక్‌ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా తమ బ్రేకప్‌పై తొలిసారిగా షణ్ముక్‌ స్పందించాడు. 

'ఆమెకు నిర్ణయం తీసుకునే హక్కుంది. తను ఇప్పటివరకు చాలా ఫేస్‌ చేసింది. ఇప్పటికైనా ఆమె సంతోషంగా, పీస్‌ఫుల్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా దారులు వేరైనా స్నేహితులుగా కలిసుంటాం. నేను బెటర్‌ పర్సన్‌ అయ్యేందుకు ఈ 5 సంవత్సరాలు నువ్వు అందించిన సహాయానికి ధన్యవాదాలు. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆల్‌ ది బెస్ట్‌ దీపూ'.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. ప్రస్తుతం షణ్నూ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

కాగా  ఈ బ్రేకప్‌కి ప్రధానంగా బిగ్‌బాస్‌ కారణమని తెలుస్తుంది. షణ్నూ సిరితో క్లోజ్‌గా ఉండటం, ఫ్రెండిప్‌ అంటూనే వీరిద్దరు చేసిన అతి చాలామందికి నచ్చలేదు. స్వయంగా సిరి వాళ్ల మథర్‌ హౌస్‌లోకి వచ్చి హగ్గులు నచ్చలేదని, తీరు మార్చుకోలేదని చెప్పినా వీరు మాత్రం తమకు నచ్చినట్లే ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నుంచి యూత్‌కి సైతం వీరి ప్రవర్తన నచ్చలేదు. సిరి-షణ్నూల తీరుతో అటు దీప్తి సునయన, శ్రీహాన్‌ సైతం ట్రోలింగ్‌ని ఎదుర్కున్నారు. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top