Shanmukh Jaswanth Comments On Deepthi Sunaina And Siri In Live Chat, Details Here - Sakshi
Sakshi News home page

Shannu: దీప్తి సునయనతో బ్రేకప్‌? పచ్చబొట్టుపై క్లారిటీ ఇచ్చిన షణ్నూ

Dec 26 2021 6:48 PM | Updated on Dec 27 2021 4:56 PM

Shanmukh Comments On Deepthi Sunaina And Siri In Live Chat - Sakshi

Shanmukh Comments On Deepthi Sunaina And Siri In Live Chat: యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్ జస్వంత్.(షణ్నూ). అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ సీజన్‌-5లో ఎంట్రీ ఇచ్చి టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే సిరితో రిలేషన్‌, పదేపదే హగ్గులతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఫలితంగా కప్పు చేజార్చుకొని రన్నరప్‌గా నిలిచాడు. హౌస్‌లోకి వచ్చే ముందే సిరికి శ్రీహాన్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరగడం, షణ్నూ, దీప్తి సునయనతో రిలేషన్‌ షిప్‌లో ఉండటంతో వీరి రిలేషన్‌ ఆడియెన్స్‌కు అంతగా రుచించలేదు. దీంతో సోషల్‌ మీడియాలో సిరి-షణ్నూలు విపరీతమైన ట్రోలింగ్‌ బారిన పడ్డారు. 

ఇటీవలె బిగ్‌బాస్‌ ముగియడంతో హౌస్‌ నుంచి బయటకు వచ్చిన షణ్నూ.. తాజాగా ఇన్‌స్టాలో లైవ్‌ సెషన్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. దీప్తి సునయన గురించి ఎక్కువగా అడుగుండటంతో షణ్నూ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం తనని బ్లాక్‌ చేసిందని, దీంతో త్వరలోనే హైదరాబాద్‌ వెళ్లి తనని కలుస్తానని చెప్పుకొచ్చాడు.

దీపు నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్‌ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్‌ అయితే జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను' అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు సిరితో తన ఫ్రెండ్షిప్‌ సైతం కంటిన్యూ అవుతుందని, జెస్సీ, సిరిలు తన బెస్ట్‌ఫ్రెండ్స్‌ అని తెలిపాడు. 

Advertisement
 
Advertisement
Advertisement