Deepthi Sunaina Shares Facebook Post About Shanmukh Jaswanth Over Breakup? - Sakshi
Sakshi News home page

Deepthi Sunaina: చేంజ్‌ తప్పదంటూ దీప్తి పోస్ట్‌, షణ్నూతో బ్రేకప్‌ తప్పదా?

Dec 30 2021 4:32 PM | Updated on Dec 31 2021 11:02 AM

Deepthi Sunaina Shares A Post In Facebook About Shanmukh Jaswanth Over Break Up - Sakshi

ప్రముఖ యూట్యూబ్‌ స్టార్స్‌, లవ్‌బర్డ్స్‌ షణ్ముక్‌ జశ్వంత్‌-దీప్తి సునైనాల ప్రేమ వ్యవహరం బ్రేకప్‌ దిశగా అడుగెలుస్తోన్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌజ్‌లో సిరి, షణ్ముక్‌ల అతి ఫ్రెండ్‌షిప్‌యే దీనికి కారణమని తెలిసిందే. హౌజ్‌లో సిరి-షణ్ముక్‌లు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవ్వడం, తరచూ హగ్‌లు ఇచ్చుకోవడంతో ఇద్దరూ విపరీతమైన ట్రోల్స్‌ బారిన పడ్డారు. హౌజ్‌లో అడుగు పెట్టడానికి ముందే వీరిద్దరూ వేరేవారితో రిలేషన్‌లో ఉన్నప్పటికీ.. వీరి అతి ప్రవర్తన అందరిని ఇబ్బంది పెట్టింది.

ఫలితంగా దీప్తి సునైనా ​​కొద్ది రోజులుగా షణ్నును ఉద్దేశిస్తూ వరుస పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలో ఆమె పోస్ట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అంతేగాక హౌజ్‌ నుంచి బయటకొచ్చాక లైవ్‌లోకి వచ్చిన షణ్నూ కూడా తనను దీప్తి బ్లాక్‌ చేసిందని చెప్పాడు. అవి చూసి వారి ఫాలోవర్స్‌ ప్రస్తుతం షణ్నూపై దీప్తి కోపంగా ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో వారి సపరేషన్‌ను ఉద్దేశిస్తూ దీప్తి సునైనా తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. దీంతో అది నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: Pradeep Machiraju: వైరల్‌ అవుతున్న యాంకర్‌ ప్రదీప్‌ ట్వీట్‌, మాచిరాజుపై నెటిజన్ల ప్రశంసలు

ఈ పోస్ట్‌లో ఆమె ‘మారడం అసౌకర్యంగా ఉంది.. కానీ తప్పదు(Change is uncomfortable but necessary) అంటూ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ షేర్‌ చేసింది. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్‌ దీప్తి పోస్ట్‌పై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. షణ్ముక్‌ నుంచి విడిపోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లుగా అభిప్రాయపడుతూ తన నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు. ‘గుడ్‌ డెసిజన్‌ దీప్తి గారు’, ‘మీరు వందశాతం సరైన నిర్ణయం తీసుకున్నారు’, ‘ఈ నిర్ణయానికే కట్టుబడి ఉండండి’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement