కారు కొన్న 'బిగ్‌బాస్' దీప్తి సునయన.. రేటు ఎంతో తెలుసా? | Deepthi Sunaina Buys New Car; Check Details - Sakshi
Sakshi News home page

Deepthi Sunaina: డిఫరెంట్ కారు కొన్న దీప్తి సునయన.. వీడియో వైరల్

Apr 23 2024 11:25 AM | Updated on Apr 23 2024 11:52 AM

Deepthi Sunaina Buys New Car And Cost Details - Sakshi

బిగ్ బాస్ షోతో చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు. వాళ్లలో ఒకరు దీప్తి సునయన. స్వతహాగా యూట్యూబర్ అయిన ఈమె.. షన్నుతో ప్రేమ వ్యవహారంతో మరింత పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన్న దీప్తి.. కొత్త కారు కొనేసింది. అందరిలా లగ్జరీ కార్లు కాకుండా కాస్త డిఫరెంట్ కారు తీసుకుంది. మరి ఈ కారు రేటు ఎంతో తెలుసా?

(ఇదీ చదవండి: వాళ్ల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చిన ప్రభాస్.. ఎందుకంటే?)

డబ్ స్మాష్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునయన.. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే యూట్యూబ్‌లో వెబ్ సిరీసులు చేస్తోంది. అప్పట్లో బిగ్‌బాస్ రెండో షోలోనూ పాల్గొని మంచి ఫేమ్ సంపాదించింది. ఇక యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ఈమె ప్రేమ-బ్రేకప్ గురించి అందరికీ తెలిసిందే.

తాజాగా దీప్తి సునయత తన తొలి కారుని కొనుగోలు చేసింది. టయోటా హై లక్స్ అనే కారుని కొనేసింది. ఇందులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వరకు కూర్చోవచ్చు. అలానే వెనక లగేజీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. నార్మల్ కారు కాకుండా ఇలా డిఫరెంట్ కారు ఎందుకు తీసుకుందా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. మార్కెట్‌లో ఈ కారు ధర రూ.30-37 లక్షల వరకు ఉంది.

(ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్)

Advertisement
 
Advertisement
Advertisement