ప్రేమ పేరుతో సోదరుడు మోసం.. గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్‌

Bigg Boss Fame Shanmukh Jaswanth Arrested In This Case - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం, ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ గంజాయితో పట్టుపడ్డాడు.  ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్‌ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్‌ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ప్రేమ పేరుతో మోసం
షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ యువతితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నాడు.  ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు. 20 రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. 

అన్న కోసం వెళ్తే.. అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు
యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంపత్‌ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్‌ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా..షణ్ముఖ్‌ ఒక్కడే కనిపించాడు. అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఈ సమయంలో సదరు యువతితో షణ్ముఖ్‌ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top