Bigg Boss-5: సన్నీ అరాచకం.. హగ్‌లతో ‘అప్పడం’.. షణ్ముఖ్‌ పరువు తీశాడుగా!

Bigg Boss 5 Telugu: Sunny Imitated Shanmukh And Siri Hug Seen In Role Play Task - Sakshi

Bigg Boss 5 Telugu, Episode 94: ఇంటి సభ్యులకు సూపర్‌ లగ్జరీ ఐటమ్స్‌ ఇచ్చేందుకు చిన్నపాటి టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.  లగ్జరీ ఐటమ్‌ పొందాలంటే ముందుగా గుజాబ్‌ జామ్‌ టాస్క్‌ గెలవాలని కండీషన్‌ పెట్టారు. చేతులు ఉపయోగించకుండా ఎవరైతే ఎక్కువగా గులాబ్‌ జామ్‌లు తింటారో వారే టాస్క్‌ విజేతలుగా నిలిచి, లగ్జరీ ఐటమ్‌ పొందుతారు. ఈ టాస్క్‌లో సిరి గెలిచి ఫ్రైడ్ చికెన్ ఐటమ్‌ పొందింది. 

‘అప్పడం’ చేసేసిన సన్నీ
ప్రేక్షకులకు నచ్చిన ఐకానిక్ సంఘటనల్ని ఒకరి రోల్ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్‌. ఎవరైతే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకి గార్డెన్‌ ఏరియాలో స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ఓటింగ్ బూత్ నుంచి ఆడియన్స్‌కి ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తామని  ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా సన్నీ-సిరిల మధ్య జరిగిన ‘అప్పడం’వివాదాన్ని ఇమిటేట్‌ చేసి చూపించాలని ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ టాస్క్‌లో సన్నీలా సిరి, సిరిలా షణ్ముఖ్‌, షణ్ముఖ్‌లా సన్నీ, కాజల్‌లా శ్రీరామ్‌.. యానీ మాస్టర్‌లా మానస్‌, రవిలా కాజల్‌ వారి వారి పాత్రల్లో అద్భుత నటనను ప్రదర్శించారు. 

ముఖ్యంగా షణ్ముఖ్‌ పాత్ర చేసిన సన్నీ అయితే... తనదైన యాక్టింగ్‌తో తెగ నవ్వించేశాడు. సద్దుదొరికితే చాలు... సిరి పాత్రలో ఉన్న షణ్ముఖ్‌ని గట్టిగా  చేసుకుంటూ.. ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రోజూ షణ్ముఖ్-సిరిలు ఎలాగైతే చేస్తారో అలా చేసి నవ్వులు పూయించాడు. సన్నీ వేసే పంచులకు షణ్ముఖ్‌ బిత్తరపోయాడు. తనను మాములుగా ఇమిటేట్‌ చేస్తేనే భరించలేని షన్నూ.. సన్నీ ఫెర్ఫామెన్స్‌ని తట్టుకోలేక పాత్ర నుంచి బయటకు వచ్చి.. ఇదే వేరే విధంగా వెళ్తుంది.. నువ్ బాగా ఓవర్ చేస్తున్నావ్ అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో సన్నీ కొంచెం తగ్గాడు. మొత్తానికి ఈ అప్పడం టాస్క్‌లో అయితే సన్నీ కొంచెం అతిగా రెచ్చిపోయి... షణ్ముఖ్‌, సిరిల పరువు తీశాడనే చెప్పాలి. అయితే ఇది సన్నీ కేవలం నవ్వించడానికే చేశాడు తప్ప కావాలని చేసినట్లయితే కనిపించదు. 

టాస్క్ అయిపోయిన తరువాత.. సన్నీ దగ్గరకు వచ్చిన షణ్ముఖ్.. నువ్ చాలా వెకిలి చేష్టలు చేశావ్.. ఇమిటేట్ చేస్తే నాకు అస్సలు నచ్చదు.. ఇమిటేషన్ వేరు.. వెకిలివేరు.. నువ్ చేసినట్టుగా ఎదుటివాళ్లు నీ గురించి చేస్తే బాధ తెలుస్తుంది.. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు అని చెప్పడంతో సన్నీ వివరణ ఇచ్చేకున్నాడు. నేను కామెడీగానే చేశాను.. క్యారెక్టర్‌లో ఉన్నాను.. కాజల్‌ని కూడా తిట్టాను కదా.. నెక్స్ట్ టైం అలా చేయను అంటూ వచ్చి షణ్ముఖ్‌ని హగ్ చేసుకున్నాడు సన్నీ. పక్కనే ఉన్న సిరి.. సర్లే అయిపోయిందిగా వదిలేయండి అని చెప్పడంతో షణ్ముఖ్‌ కూల్‌ అయిపోయాడు. 

కాజల్‌పై మానస్‌ ఫైర్‌
ఇక ఈ రెండో టాస్క్‌గా మానస్‌-ప్రియాంకల ప్రయాణాన్ని ఇమిటేట్‌ చేసి చూపించాలని చెప్పాడు బిగ్‌బాస్‌. దీంతో  సన్నీ ప్రియాంకలా మారగ, కాజల్‌ మానస్‌లా మారిపోయింది. శ్రీరామ్‌లా సిరి, జెస్సీలా షణ్ముఖ్‌, సిరిలా శ్రీరామ్‌ మారిపోయారు. అయితే ఈ టాస్క్‌ కోసం సన్నీ రెడీ అవుతున్న క్రమంలో కాజల్‌, మానస్‌ల మధ్య గొడవ జరిగింది. పింకీకి 100 సార్లు ఐలవ్యూ చెబుతానని కాజల్‌ కామెడీగా అన్నప్పటికీ.. మానస్‌ సీరియస్‌గా తీసుకున్నాడు. 

గబ్బు చేస్తే బాగుండదని మానస్‌ ముందే హెచ్చరించగా.. ఎట్ల అనిపిస్తే అట్ల చేస్తామని సన్నీ తేలిగ్గా తీసిపాడేశాడు. ఎంటర్‌టైనింగ్‌ చేస్తున్నామని కాజల్‌ చెప్పబోగా.. ‘ఎంటర్‌టైనింగ్‌గా చేస్తే చేయ్‌.. కానీ 100సార్లు ఐ లవ్యూ అని ఎవడు చెప్పాడు?’అని కాజల్‌పై మానస్‌ సీరియస్‌ అయ్యాడు. దీంతో బాగా హర్ట్‌ అయిన కాజల్‌.. మానస్‌ క్యారెక్టర్‌ చేయనని చెప్పింది. సన్నీ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. కాజల్‌ వినలేదు. దీంతో సన్నీ మానస్‌ని పింకీ క్యారెక్టర్‌ చేయమని కోరగా.. దానికి మానస్‌ ఓకే చెప్పేశాడు. 

పింకీగా మానస్‌.. మళ్లీ సన్నీ అదరగొట్టేశాడుగా
పింకీగా మానస్‌ , మానస్‌గా సన్నీ.. ఇద్దరు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా మానస్‌ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు. మానస్‌ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్‌ కూడా చేయించుకున్నాడు. మరోవైపు షణ్ముఖ్‌ జెస్సీలా మారి.. సిరిని ఓ రేంజ్‌లో ఆటపట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ.. సిరి ఓ ముద్దు అడిగాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్‌ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్‌ ఇచ్చాడు. ఇక చివరగా.. మానస్‌ నుంచి పింకీ ఎలాంటి ప్రేమను ఆశించిందో అది చేసి చూపించాడు సన్నీ. పింకీ పాత్రలో ఉన్న మానస్‌ దగ్గరు వెళ్లి.. నా ప్రేమ, మన ఫ్రెండ్‌షిప్‌ ఎప్పటికీ ఇలానే కొనసాగుతుంది పింకీ అని భరోసా ఇచ్చాడు. ఇది చూసి కాజల్‌ కనీళ్లు పెట్టుకుంది. తమ తమ క్యారెక్టర్ల నుంచి బయటకు వచ్చి ముగ్గురు గట్టిగా హగ్‌ చేసుకున్నారు. మొత్తనానికి మంగళవారం ఎపిసోడ్‌లో సన్నీ తన ఆట తీరుతో అందరిని మెప్పించాడనే చెప్పాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top