
Shanmukh Jaswanth Agent Anand Santosh Teaser: యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్, బ్రేకప్ తర్వాత తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు షణ్ముఖ్ జశ్వంత్. ఈ క్రమంలోనే 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్ చేస్తున్నట్లు ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
'ఇంతకీ నువ్ ఏం చేస్తుంటావ్ ? నెలకు నీ జీతం ఎంత వస్తుంటుంది ? అసలు ఎంత ఖర్చవుతుంది ? ఎంత మిగులుతుంది ?' అంటూ షణ్ముఖ్‌ను ప్రశ్నలు అడగడంతో ప్రారంభమవుతుంది ఈ టీజర్. ఈ ప్రశ్నలకు నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్‌ను సర్ అని షణ్ముఖ్ ఇచ్చే సమాధానం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వెబ్ సిరీస్‌పై ఆసక్తి కలిగించారు. ఇందులో షణ్ముఖ్ జశ్వంత్ స్టైలిష్‌గా కనిపించాడు. 'మనసు తప్ప.. ఫిజికల్‌గా, లిక్విడ్‌గా ఏదైనా వెతికి పెడతా' అని చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సిరీస్‌కు అరుణ్ పవర్ దర్శకత్వం వహించగా, సుబ్బు స్క్రిప్ట్ అందించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది.
చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్
ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు..
నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్