ఉపాధి హామీ పేరు మార్పు అన్యాయం
షాబాద్: పూర్వపు ఉపాధి హామీ పథకం స్వరూపాన్ని మార్చి కేంద్రం ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీంభరత్ ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ బుధవారం మండల పరిధిలోని కుర్వగూడ ఉపాధిహామీ కూలీలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఉన్న పథకాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. అందులో భాగంగా గాంధీజీ పేరు తొలగించిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకురాళ్లు స్వరూప, అశ్విని, మహేశ్వరి, కవిత, అమృత తదితరులున్నారు.
ఉపాధి హామీ పేరు మార్పు అన్యాయం


