ఉపాధిహామీని నీరుగార్చే కుట్ర
మంచాల: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. మండల పరిధిలోని లోయపల్లిలో శనివారం ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకానికి పేరు మార్చి, నిర్వీర్యం చేసి కూలీల పొట్ట కొట్టే విధంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. ప్రతి జాబ్‌కార్డుకు 200 రోజులు పనిదినాలు కల్పించాలని, దినసరి కూలి రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశా రు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య, మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్‌రెడ్డి, పి.అంజయ్య, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


