ఉద్యోగులకు నిరాశే
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసింది. వారికి లబ్ధి చేకూర్చే ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు. విద్యా వ్యవస్థకు పెద్దగా కేటాయింపులు లేవు. రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌లో విద్యా రంగానికి కేవలం రూ.13,289 కోట్లు మాత్రమే(2.6 శాతం) కేటాయించింది. గత ఏడాది కేటాయించిన బడ్జెట్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రభుత్వ విధానాలు పేదలను విద్యకు దూరం చేసేలా ఉన్నాయి. ఉద్యోగుల నుంచి ఆదాయపన్ను ముక్కుపిండి వసూలు చేస్తుంది.
– వై.కరుణాకర్‌రెడ్డి, ఎస్‌టీయూటీఎస్, కార్యదర్శి


