లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
తుక్కుగూడ: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలే లక్ష్యంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ డిమాండ్ చేశారు. డివిజన్ కేంద్రంలో ఆదివారం కార్మిక సంఘాల జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో హాజరై సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కవిత, శివ, సుజాత, పానుగంటి పర్వతాలు, దత్తునాయక్, రుద్రకుమార్, చందు యాదవ్, సత్యానారాయణ, మల్లేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్: ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ ఒలింపియాడ్‌లో మొయినాబాద్‌లోని మెలోహా స్కూల్ విద్యార్థిని సహస్ర సత్తా చాటింది. ఇటీవల సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ ఒలింపియాడ్‌లో మెలోహా స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న సహస్ర ఉత్తమ ప్రతిభ కనబర్చింది. ఈ ఘనత సాధించిన సహస్రను, ఆమె తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీసాయిచంద్
ఆమనగల్లు: మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఎన్నికల బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజనీసాయిచంద్, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆమనగల్లు పట్టణంలోని శ్రీకాంత్ కాలనీలో ఆదివారం 9వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి సయ్యద్ ఖలీల్‌కు మద్దతుగా వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆమనగల్లు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు తీసుకు వచ్చారన్నారు. అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ నాయకులకు ము న్సిపల్ ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు. దొంగ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలలో ఓటమి తప్పదన్నారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు అర్జున్‌రావ్, మాజీ ఎంపీపీ నిర్మల, నాయకులు కుమార్, శ్రీనివాస్, నిరంజన్‌గౌడ్, బాలస్వామి, హాజీపాషా తదితరులు ఉన్నారు.
ఎయిర్‌పోర్టులోకి లేజర్ కిరణాలు
శంషాబాద్: విమానాశ్రయంలో లేజర్ కిరణాలు పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం రాత్రి ఎయిర్‌పోర్టులోని రన్‌వే–09ఆర్‌కు దక్షిణ ప్రాంతం నుంచి రంగురంగుల లేజర్ కిరణాలు ప్రసరించడంతో అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. లేజర్ కిరణాలు ఎక్కడి నుంచి పడ్డాయన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నారు.
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి


