జిల్లాకు అన్యాయం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. పేదలకు చేకూరే మేలు ఏమాత్రం లేదు. ఇది పూర్తిగా పెద్దలకు దోచిపెట్టే బడ్జెట్‌లా మిగిలిపోయింది. కనీసం జిల్లా పేరు కానీ, కీలక ప్రాజెక్టుల ప్రస్తావన గానీ తీసుకురాకపోవడం అన్యాయం. ప్రభుత్వ సొమ్మును కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా ఉంది. యువతకు ఉద్యోగాలు లేవు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ఏ ఒక్క చర్య లేదు. ఇది పూర్తిగా ప్రజావ్యతిరేక బడ్జెట్.
– చల్లా నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు


