మంచి నేలలతో ఆరోగ్యకర పంటలు
చేవెళ్ల: మంచి నేలలతోనే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ దిలీప్, డాక్టర్ హిమబిందు అన్నారు. పట్టణ కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నేల ఆరోగ్యం, సారవంతమైన భూమి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేల ఆరోగ్యం, పంట ఉత్పాదకతలో నేల పాత్ర గురించి వివరించారు. నేల పోషకాలు నేల సంతానోత్పత్తి నిర్వహణ, భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ జి.మహేశ్వర్‌రావు, వినోద్‌కుమార్, ఏఓ శంకర్‌లాల్, మోడల్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


