అనుమతులు లేకుండా మట్టి రవాణా
చేవెళ్ల: అర్ధరాత్రి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ఐదు టిప్పర్లను సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని కందవాడ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోనలి కందవాడ టైర్ల కంపెనీ సమీపంలోని ఓ భూమి నుంచి మట్టి తవ్వి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా రెండు టిప్పర్లలో మట్టి లోడ్ చేయగా మరో మూడు ఖాళీగా ఉన్నాయి. అక్కడే సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వడ్డె యాదయ్యను ప్రశ్నించగా ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదు. అనుమతి పత్రాలు చూపలేదు. దీంతో సూపర్ వైజర్‌తోపాటు డ్రైవర్లను అరెస్ట్ చేసి టిప్పర్లను స్టేషన్‌ను తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్
షాబాద్: ప్రభుత్వ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను చేవెళ్ల ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని పోతుగల్‌కు చెందిన కరుణాకర్‌రెడ్డి మరికొందరు సిండికేట్‌గా మారి పోతుగల్ తండా శివారులోని ప్రభుత్వ లావాని భూముల్లో జేసీబీతో మట్టిని తవ్వి మట్టి తరలిస్తున్నారు. కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న ఈ తంతును గమనించిన ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఓ టిప్పర్‌ను పట్టుకున్నారు. లోడ్‌తో ఉన్న టిప్పర్‌తో పాటు డ్రైవర్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని షాబాద్ పోలీసులకు అప్పగించామన్నారు. టిప్పర్ యజ మాని కరుణాకర్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఐదు లారీలు సీజ్.. డ్రైవర్లు అరెస్ట్


