వేసవిలో మూగజీవాలు జాగ్రత్త
మొయినాబాద్ రూరల్: వేసవి కాలంలో పాడి పశువులతో పాటు మూగ జీవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని రంగారెడ్డి జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ వైద్యుడు డాక్టర్ శ్రీకర్‌రెడ్డి, పశువైద్య అధికారి దేవిరెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి రాజేందర్‌రెడ్డి సూచించారు. కాశీంబౌలి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన నదీమ్‌నగర్‌లో శుక్రవారం పాడిపశువులకు ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్‌రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్‌యాదవ్, పశువైద్యాధికారి దేవిరెడ్డి, మండల పశువైద్యాధికారి డాక్టర్ అహ్మద్, గోపాలమిత్ర సూపర్ వైజర్ వెంకటేశ్, శ్రీను, బాలకృష్ణ, యాదయ్య, పశువైద్య సిబ్బంది రవి, రైతులు పాల్గొన్నారు.


