మున్సిపల్‌ బరిలో మాజీ ఎమ్మెల్యే తనయుడు | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ బరిలో మాజీ ఎమ్మెల్యే తనయుడు

Jan 31 2026 9:30 AM | Updated on Jan 31 2026 9:30 AM

మున్సిపల్‌ బరిలో  మాజీ ఎమ్మెల్యే తనయుడు

మున్సిపల్‌ బరిలో మాజీ ఎమ్మెల్యే తనయుడు

మున్సిపల్‌ బరిలో మాజీ ఎమ్మెల్యే తనయుడు బల్దియా పాలకమండలి చివరి సమావేశం నేడు నాంపల్లిలో మెట్రో ఆటోమేటెడ్‌ పార్కింగ్‌

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొండిగారి రాములు తనయుడు త్రిలోక్‌ మున్సిపల్‌ బరిలో నిలవనున్నారు. మున్సిపాటీలోని 12వ వార్డు నుంచి శుక్రవారం ఆయన నామినేషన్‌ వేశారు. రాములు ప్రస్తుతం స్థానిక బృందావన్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. త్రిలోక్‌కు బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ కేటాయించారు. ఈ సందర్భంగా కాలనీలో ఊరేగింపు తీశారు.

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10న ముగుస్తున్న నేపథ్యంలో.. కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం శనివారం జరగనుంది. రాబోయే ఆర్థిక సంవ త్సరం (2026–27) బడ్జెట్‌ను ఆమోదించనున్నారు. విలీన స్థానిక సంస్థలతో జీహెచ్‌ఎంసీ పరిధి పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన రూ.11,460 కోట్ల బడ్జెట్‌ను జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఇప్పటికే ఆమోదించింది. స్టాండింగ్‌ కమిటీ అంగీకారం అనంతరం కౌన్సిల్‌లో ఆమోదం పొందాక.. పభ్రుత్వానికి సమాచారమివ్వడం ఆనవాయితీ. అందులో భాగంగా శనివారం బడ్జెట్‌ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. విలీన ప్రాంతాల స్థానికసంస్థల ఆదాయ, వ్యయాల్ని కూడా పరిగణన లోకి తీసుకొని స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది.

నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మెట్రోరైల్‌ నాంపల్లిలో నిర్మించిన ఆటోమేటెడ్‌ బహుళ అంతల పార్కింగ్‌ సముదాయాన్ని శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించనున్నారు. సుమారు 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌ చేసుకోవచ్చు. మానవ ప్రమేయం లేకుండా పార్కింగ్‌ చేసే సదుపాయం ఉంది.రూ.102 కోట్లతో.. జర్మనీకి చెందిన అత్యాధునిక పాలిస్‌ పరిజ్ఞానంతో ఇది రూపుదిద్దుకుంది. దేశంలోనే ఈ తరహా పార్కింగ్‌ ప్రాజెక్ట్‌ మొదటిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement