రేపు ఏటీసీ నిర్మాణానికి శంకుస్థాపన
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్దలో ఈ నెల 30న అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు బుధవారం అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. గ్రామంలోని 150 ఏళ్ల చరిత్ర ఉన్న జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించేందుకు డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విచ్చేయనున్నట్లు చెప్పారు. రూ.45 కోట్లతో నిర్మించనున్న ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. సర్పంచ్ కృష్ణ, పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటుగా అధికారులు, గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించామన్నారు. శంకుస్థాపన అనంతరం పాఠశాల ఆవరణలో బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. గత ఏడాది పాఠశాల వార్షికోత్సవానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి గ్రామాభివృద్ధిదకి, పాఠశాలఅభివృద్ధికి నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి, గవర్నర్ సత్యనారాయణరెడ్డి, హరగోపాల్ ఇక్కడ చదివిన వారేనని వివరించారు. మొగిలిగిద్ద పాఠశాల 100వ వార్షికోత్సవానికి ఎస్‌ఆర్.శంకరన్, 125వ వార్షికోత్సవానికి ప్రొఫెసర్ జయశంకర్, 150 వార్షికోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై పాఠశాల, గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సరిత, తహసీల్దార్ నాగయ్య, డీఈఓ సుశీందర్‌రావు, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ విజయ్‌కుమార్, ఎంఈఓ మనోహర్, పంచాయతీ కార్యదర్శి బాసిత్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీశైలం, నాయకులు శ్యాంసుందర్, గుట్టరాజు, వెంకటయ్య, పఠాన్‌పాష, జగన్, వెంకటేశ్, మల్లేశ్, రాము, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


