అభివృద్ధి చూపి ఓట్లు అడగండి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం బీఆర్‌ఎస్‌దేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పార్టీ ఎన్నికల అబ్జర్వర్ నందికంటి శ్రీధర్‌తో కలిసి పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి చూపి ఓట్లు అభ్యర్థించాలన్నారు. నగరంలో ఉన్న కలెక్టరేట్, ఆర్డీఓ, ఆర్టీఏ కార్యాలయాలను ఇక్కడి తీసుకొచ్చామని గుర్తు చేశారు. కట్ట కింది నుంచి రోడ్డును వేయించడంతోపాటు, శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. ఫాక్స్‌కాన్ తదితర కంపెనీలను తీసుకొచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌దే అన్నారు. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్, ప్రభుత్వాస్పత్రి నూతన భవన నిర్మాణాలకు, అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రం, ఇబ్రహీంపట్నం నుంచి ఆక్టోపస్ వరకు రూ.60కోట్లతో రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు ఆనాడే శ్రీకారం చుట్టామని వివరించారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే వారే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని స్పష్టం చేశారు. ప్రచారశైలిని ఎప్పటికప్పుడు పర్వవేక్షిస్తుంటామని.. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యాదగిరి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొదటి జాబితా
బీఆర్‌ఎస్ తరుపున పోటీచేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి ఈ సమావేశంలో ప్రకటించారు. ఇబ్రహీంపట్నం 2వ వార్డు నుంచి సయ్యద్ హిదాయత్ అలీ, 3వ వార్డు తాళ్ల వెంకటేశ్‌గౌడ్, 7వ వార్డు టేకుల సుదర్శన్‌రెడ్డి, 13వ వార్డు ఆకుల సురేశ్, 15వ వార్డు క్యామ శంకర్, 17వ వార్డు మడుపు లక్ష్మీ, 19వ వార్డు ఆకుల యాదగిరి, 23వ వార్డు నీలం శ్వేత, 24వ వార్డు గూడూరి గిరిని అభ్యర్థులుగా ప్రకటించారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి


