ఆరుట్ల బడిని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
మంచాల: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా అభివృద్ధి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో కలిసి శుక్రవారం ఆయన పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, క్రీడా స్థలం, విద్యాబోధన తీరును ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల ఉన్నతికి ఉపయోగపడేలా విద్యా బోధన అందించాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, ప్రధానోపాధ్యాయుడు గిరిధర్ గౌడ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుప్రియ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ గౌడ్, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి


