నిర్లక్ష్యానికి తావీయొద్దు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి తావీయొద్దు

Feb 1 2026 10:40 AM | Updated on Feb 1 2026 10:40 AM

నిర్లక్ష్యానికి తావీయొద్దు

నిర్లక్ష్యానికి తావీయొద్దు

బావిలో పడిన చిన్నారులు సరదాగా గాలిపటాలు ఎగరేసేందుకు పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు. 8లోu

బావిలో పడిన చిన్నారులు సరదాగా గాలిపటాలు ఎగరేసేందుకు పొలం వద్దకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడ్డారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

కలెక్టర్‌ నారాయణరెడ్డి

షాద్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ, స్ట్రాంగ్‌ రూంల ఎన్నికల పర్యవేక్షకుడు మయాంక్‌ మిట్టల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యానికి తావివ్వొద్దని, సజావుగా.. ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ల భద్రత, ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు విధిగా పాటించాలని, అభ్యర్థులు ఎన్నికల నియమావళికి లోబడి ప్రచారాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ సరిత, మున్సిపల్‌ కమిషనర్‌ సునీత, తహసీల్దార్‌ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement