అయ్యసాగరంలో హెర్బల్ పార్క్ ఏర్పాటు
ఎఫ్‌ఆర్‌ఓ వెంకటయ్యగౌడ్
ఆమనగల్లు: అయ్యసాగరం అటవీ ప్రాంతంలో 125 ఎకరాల్లో హెర్బల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని ఆమనగల్లు అటవీశాఖ రేంజ్ అధికారి వెంకటయ్యగౌడ్ అన్నారు. పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. డీఎఫ్‌ఓ రోహిత్ ఆదేశాల మేరకు పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. శ్రీశైలం నుంచి వచ్చే పర్యాటకులు, ఈ ప్రాంత ప్రజలు సేద తీరేందుకు పార్క్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ పార్క్‌లో 15 కిలో మీటర్లు, 4 కి.మి., 2 కి.మి దూరంలో 3 వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పార్క్‌లో పిల్లలు ఆడుకోవడానికి వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. హోటల్స్ కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
తల్లీకుమారుల అదృశ్యం
మీర్‌పేట: భర్తతో గొడవపడిన మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. బడంగ్‌పేట లోకాయుక్తకాలనీలో నివాసముండే రమేష్, అనూష(36)లు భార్యాభర్తలు. వీరికి ఆర్యన్(6), సూయాన్(3) కుమారులు ఉన్నారు. ఈనెల 20వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన అనూష ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి కనిపించకుండా పోయింది. ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త రమేష్ బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ నేరాలు,
బ్యాంకు సేవలపై అవగాహన
కందుకూరు: ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధి మీర్‌ఖాన్‌పేటలో సైబర్ నేరాలు, బ్యాంకు సదుపాయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ సైబర్ నేరాల గురించి వివరించారు. డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ మోసాలు ఏవిధంగా జరుగుతున్నాయో అవగాహన కల్పించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఎస్‌బీఐ మేనేజర్ ఆర్‌ఎల్‌ఎన్ శాస్త్రి బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. 18 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రూ.20 చెల్లించి వ్యక్తిగత ప్రమాద బీమా చేసుకోవాలని సూచించారు. రూ.436 చెల్లించి జీవన జ్యోతి బీమా పథకంలో చేరవచ్చని తెలిపారు. బీమా పొందిన వారు మృతి చెందితే రూ.2 లక్షలు నామినీకి అందుతుందన్నారు. అనంతరం ప్రమాద బీమాలో సభ్యులుగా ఉండి మరణించిన వారికి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సైదులు, నాయకులు వై.వెంకటేశ్, మల్లేశ్ యాదవ్, ఎస్‌కే రఫియా, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కల్లుగీత సహకార సంఘం నియామకం
కడ్తాల్: ఆమనగల్లు ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మర్రిపల్లిలో బుధవారం కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్, ఎస్‌ఐ చంద్ర కిరణ్ పర్యవేక్షణలో కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం గ్రామ అధ్యక్షుడిగా యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడిగా రాములుగౌడ్, కార్యదర్శిగా ఎన్.పెద్దయ్యగౌడ్, డైరెక్టర్లుగా నర్సింహగౌడ్, జంగయ్యగౌడ్ నియమితులయ్యారు. నూతన కమిటీకి సీఐ బద్యానాథ్ చౌహాన్ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం నాయకులు నూతనకమిటీని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశ్‌గౌడ్, మల్లేశ్‌గౌడ్, నారాయణగౌడ్ జంగయ్యగౌడ్, హెడ్ కానిస్టేబుల్స్ శంకర్, చానాగౌడ్ పాల్గొన్నారు.
అయ్యసాగరంలో హెర్బల్ పార్క్ ఏర్పాటు
అయ్యసాగరంలో హెర్బల్ పార్క్ ఏర్పాటు
అయ్యసాగరంలో హెర్బల్ పార్క్ ఏర్పాటు


