పాత సిబ్బందినే కొనసాగించండి
మంచాల: మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో కొన్నేళ్లుగా వంట చేస్తున్న కార్మికులను మాత్రమే కొనసాగించాలని సీఐటీయూ(మధ్యాహ్న భోజన పథకం యూనియన్) జిల్లా అధ్యక్షురాలు వై.స్వప్న అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రధానోపాధ్యాయుడు గిరధర్‌గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో అన్ని పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మారిందన్నారు. అధికారులు కొత్తగా వంట సిబ్బందిని తీసుకోవాలనే నిర్ణయం విరమించుకోవాలన్నారు. పాత సిబ్బంది 20 ఏళ్లుగా అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించారని చెప్పారు. నేడు పాత వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ, మధ్యాహ్న భోజనం పథకం యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కల్పన, సరిత తదితరులు పాల్గొన్నారు.


