పోలింగ్‌ కేంద్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Jan 31 2026 9:29 AM | Updated on Jan 31 2026 9:29 AM

పోలిం

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

ఆమనగల్లు: పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మున్సిపల్‌ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను శుక్రవారం మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల అధికారులు పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పా రు. ఓటింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు అవ సరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించా రు. కార్యక్రమంలో మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, ఆమనగల్లు సీఐ జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మాధవరావ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌కు భూ పరిశీలన

కందుకూరు: ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ సర్వే నంబర్‌ 112లోని 24 ఎకరాల భూమిని శుక్రవారం సీపీ జి.సుధీర్‌బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక్కడ చేపట్టే భవనాలకు చేరుకునేలా రోడ్ల నిర్మాణాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఆయన వెంట మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, గ్రీన్‌ ఫార్మా సీఐ సత్యనారాయణ ఉన్నారు.

భక్తిశ్రద్ధలతో రేణుకా జమదగ్ని కల్యాణం

తుర్కయంజాల్‌: అదిబట్ల సర్కిల్‌ పరిధి రాగన్నగూడలో నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్రచండీ మహాయాగంలో భాగంగా మూడో రోజు శుక్రవారం రేణుకా జమదగ్ని కల్యాణం, లక్ష్మీనారాయణ హోమం, పూర్ణాహుతి, లలితామతి శర్మచే అమ్మవారి విశేష ఆరాధన, భజన కార్యక్రమాలు నిర్వహించారు. సహస్ర దీపాలంకరణ సేవ, మహిళలతో సామూహిక కుంకుమార్చన, సుధామాల, మాధవీమాల శిష్య బృందంతో నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కా జిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, రాష్ట్ర రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కొడుకు బీఆర్‌ఎస్‌..

తండ్రి కాంగ్రెస్‌!

ఒకే వార్డులో నామినేషన్లు దాఖలు

చివరి నిమిషంలో అనూహ్య పరిణామం

శంకర్‌పల్లి: ఎన్నికల్లో భాగంగా శంకర్‌పల్లి మున్సిపాలిటీలో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ తరఫున బుధవారం, శుక్రవారం దండు సంతోష్‌ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్‌ వేసిన సమయంలో అతని తండ్రి రాజేశ్వర్‌ కొడుకుతో పాటే వచ్చి బలపర్చాడు. తర్వాత ఏం జరిగిందో ఏమో సాయంత్రం 4.30 గంటలకు కాంగ్రెస్‌ కండువా వేసుకుని వచ్చిన రాజేశ్వర్‌ ఆ పార్టీ తరఫున అదే వార్డుకు నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ నేత యంసాని ప్రకాశ్‌గుప్తా తో వచ్చి రిటర్నింగ్‌ అధికారికి పత్రాలు సమర్పించారు. ఒకే వార్డు నుంచి వేర్వేరు పార్టీల తరఫున తండ్రీకొడుకులు నామినేషన్లు వేయ డం చర్చనీయాంశంగా మారింది. వీరు తుది బరిలో ఉంటారా.. లేదా..? ఎవరు తప్పుకొంటారనే విషయంపై ఉపసంహరణ వరకూ ఉత్కంఠ కొనసాగనుంది.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన 
1
1/3

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన 
2
2/3

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన 
3
3/3

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement