మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి
కందుకూరు: వికసిత్ భారత్ 2047 లక్ష్యసాధనకు అనుగుణంగా ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ముచ్చర్లలో వికసిత్ భారత్, గ్యారెంటీ రోజ్ గార్, అజీవికా మిషన్ గ్రామీణ బిల్లుపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని తెలిపారు. ఉపాధిహామీ పథకంలో వంద రోజులుగా ఉన్న పని దినాలను 120 రోజులకు పెంచారని, నేరుగా కూలీలకు వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పథకం పేరుతో పేదలను మోసం చేసి దండుకుందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్, జిల్లా కార్యదర్శి తేరటి లక్ష్మణ్‌ముదిరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి, సర్పంచ్ ఊటు పద్మ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్క మల్లేష్, జిల్లా నాయకులు ఊటు మహేందర్, జిట్టా రాజేందర్‌రెడ్డి, సాధ మల్లారెడ్డి, బొక్క సత్యనారాయణరెడ్డి, కళ్లెం రాజేందర్‌రెడ్డి, దేశం సత్తిరెడ్డి, కొంతం జంగారెడ్డి, సోమరాజు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


