ఆ పనులకే శంకుస్థాపనలు
ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి రూ.220 కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం: గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులకే తిరిగి శంకుస్థాపనలు చేస్తూ.. రూ.220 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు గొప్పలు చెప్పుకొంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి విమర్శించారు. స్థానిక బీఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పట్లో తాను నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొచ్చిన నిధుల వివరాలను ప్రొసీడింగ్స్‌తో సహా మీడియా మందు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేస్తున్నాడే తప్ప కొత్తగా నిధులు తెచ్చి చేసిన అభివృద్ధి పనులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.220 కోట్లు మంజూరు చేయించినట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని సవాల్ విసిరారు. ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందా చేస్తున్నారని ఆరోపించారు. సరైన సమయంలో తగిన రీతిలో ప్రజలు బుద్ధిచెబుతారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
అన్నీ బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైనవే..


