మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
మొయినాబాద్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. సోమవారం మొయినాబాద్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, కమిషనర్ జాకీర్ అహ్మద్ తదితరులు నామినేషన్ సెంటర్లు, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌లు, మాక్ కళాశాలో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసేందుకు పరిశీలించారు. నామినేషన్ సెంటర్ మొయినాబాద్‌లో ఏర్పాటుకు కొన్ని భవనాలను చూశారు. వారి వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఏసీపీగా ప్రదీప్‌కుమార్ బాధ్యతల స్వీకరణ
ఇబ్రహీంపట్నం: ఆదిబట్ల ఏసీపీగా డీకే ప్రదీప్‌కుమార్ సోమ వారం బాధ్యతలు చేపట్టారు.పోలీస్‌స్టేషన్‌ను ఇటీవల హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చి డివిజన్ ఏసీపీ స్థాయి హోదా ను కల్పించిన సంగతి తెలిసిందే. నూతన డివిజన్ కార్యాలయానికి ఏసీపీగా ప్రదీప్‌కుమార్‌ను నియమించడంతో అధికారికంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో సమావేశమై ప్రజా భద్రత, నేరాలను అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలు, స్నేహపూర్వక పోలీసింగ్ వ్యవస్థ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఐ రవికుమార్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఆడబిడ్డ పుడితే
రూ.ఐదు వేలు
కడ్తాల్: మండల పరిధిలోని రేఖ్యతండా సర్పంచ్ పాత్లవత్ లక్ష్మీబాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఆడబిడ్డ పుడితే రూ.ఐదు వేలు ప్రోత్సా హంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల తండాకు చెందిన మూడవత్ శ్రీను–రజిత దంపతులకు జన్మించిన ఆడబిడ్డకు రూ.ఐదు వేలు అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవేందర్, వార్డు సభ్యులు కృష్ణ, విజయ, రాజు, హన్మా, శ్రీను, నాయకులు శ్రీధర్‌నా యక్, కృష్ణనాయక్, శ్రీనివాస్ ఉన్నారు.
300 వార్డులు, 60 సర్కిళ్లకు మ్యాపింగ్ పూర్తి
లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలో 300 వార్డులు, 60 సర్కిళ్లకు మ్యాపింగ్ పూర్తి అయింది. 27 అర్బన్ లోకల్ బాడీల విలీనంతోపాటు వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి, సర్కిళ్లను 30 నుంచి 60కి, జోన్లను 6 నుంచి 12కి పెంచిన విషయం తెలిసిందే. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలతోపాటు 60 సర్కిళ్లు, 300 వార్డుల మ్యాపింగ్‌ను ఖచ్చితత్వంతో పూర్తి చేసింది. జనన, మరణ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను విజయవంతంగా ప్రారంభించింది. మ్యా పింగ్ ఆధారంగా జనన, మరణాల నమోదు, ధ్రువపత్రాల జారీ మరింత పటిష్టంగా, పారదర్శకంగా, వేగంగా మారనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పౌరులందరూ తమ సమీప మీసేవా కేంద్రాల ద్వారాసులభంగా జనన, మరణ ధ్రువపత్రాల సేవలను వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కోరారు.
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన


