విద్యుత్ వైర్లు సరిచేయండి
● లేదంటే చర్యలు తప్పవు
● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం: విద్యుత్ అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శేరిగూడలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ఆయనకు విద్యుత్ తీగలు భూమికి తగిలే ఎత్తులో ఉన్నాయంటూ మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ ఏడీఏ సీతారాం, ఏఈ జ యన్నలను పిలిచి మందలించారు. అభివృద్ధి విషయంలో ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు. మీ దగ్గర నిధులు లేకుంటే చెప్పండి.. సొంత నిధులు వెచ్చిస్తానంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వైర్ల తొలగించకుంటే తనకే నేరుగా చెప్పాలని మహిళలకు ఎమ్మెల్యే ఫోన్ నంబర్ ఇచ్చారు.


