ముగిసిన ‘పీఎంశ్రీ’ సదస్సు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘పీఎంశ్రీ’ సదస్సు

Jan 31 2026 9:29 AM | Updated on Jan 31 2026 9:29 AM

ముగిసిన ‘పీఎంశ్రీ’ సదస్సు

ముగిసిన ‘పీఎంశ్రీ’ సదస్సు

అబ్దుల్లాపూర్‌మెట్‌: ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) ఆధ్వర్యంలో తెలంగాణ రీజియన్‌లోని పీఎంశ్రీ స్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాకులకు పిగ్లీపూర్‌ అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఇన్నోవేషన్‌ సదస్సు శుక్రవారం ముగిసింది. పీఎంశ్రీ స్కూళ్లకు చెందిన వంద మంది విద్యార్థులు, వంద మంది ఉపాధ్యాయులు ఇందులో పాల్గొన్నారు. విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు, సృజనాత్మకత, అభ్యసనలో వినూత్న పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య విద్యాసంస్థల కార్యదర్శి సి.గంగిరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ ఎల్‌వీ వేణుగోపాలరావు, నోడల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జీ.కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement