ముమ్మరంగా వాహనాల తనిఖీ
షాద్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో షాద్‌నగర్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం అధికారులు శనివారం ముమ్మరంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని మిలీనియం టౌన్ షిప్ ఎదురుగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శ్రీనివాస్, కార్తీక్ పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు ఉన్నారు.
ప్రజలు అధికారులకు సహకరించాలి
చేవెళ్ల: మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల్లో భాగంగా చేవెళ్లలో ఎస్‌ఎస్‌టీ తనిఖీ బృందం చెక్‌పోస్ట్ ద్వారా తనిఖీలు చేస్తున్నా రు. శనివారం చేవెళ్లలోని షాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు 50 వేలకు మించి నగదును తీసుకెళ్లొద్దని, అలా తీసుకెళ్తే దానికి సంబంధించిన లెక్కలు ఉండాల్సిందేనన్నారు. లేదంటే ఆ నగదును సీజ్ చేస్తామన్నారు. ప్రజలు ఎన్నికల కోడ్‌ను గుర్తించి అధికారులకు సహకరించాలని కోరారు. తనిఖీలలో డిప్యూటీ తహసీల్దార్ రాకేశ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పవన్, ఏఎస్‌ఐ బుగయ్య, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


