భారతి సిమెంట్‌తో నిర్మాణం వేగం
బడంగ్‌పేట్: సిమెంట్ రంగంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5 స్టార్ గ్రేడ్‌ను తెలంగాణలో విడుదల చేసిందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. బుధవారం బడంగ్‌పేటలోని కనకదుర్గ స్టీల్ హౌస్‌లో తాపీమేసీ్త్రల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సామ్రాట్ మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందన్నారు. అల్ట్రాఫస్ట్‌తో ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జీలు, రహదారులకు సరైన ఎంపిక అని పేర్కొన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందచేస్తామని స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సహాయపడతారని తెలిపారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్ రూ.20 రూపాయలు అధికంగా ఉంటుందన్నారు. ఈ సందర్బంగా బిల్డర్లకి రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను 20 మందికి అందజేశారు. కార్యక్రమంలో డీలర్ కొండల్‌రెడ్డి, కాంట్రాక్టర్లు, తాపీమేసీ్త్రలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు
వేగిరం చేయండి
మంచాల: తెలంగాణ పబ్లిక్ స్కూల్ అభివృద్ధి పనులను వేగిరం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం ఆయన పాఠశాలలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాల మైదానంలో అదనంగా రెండు అంతస్తుల భవనాలు, బాస్కెట్ బాల్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు అథ్లెటిక్స్‌కు అనుగుణంగా మైదానం ఏర్పాటు చేయాలన్నారు. మైదానంలోని విద్యుత్ స్తంభాలను తొలగించాలని సూచించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాందాస్, పాల్గొన్నారు.
భారతి సిమెంట్‌తో నిర్మాణం వేగం


