35,23,219
న్యూస్‌రీల్
నేడు ప్రత్యేక కార్యక్రమాలు
క్రీడాపోటీలతో.. యువత క్రీడల్లోనూ రాణించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆర్థిక, సామాజిక అంశాల్లో తెలంగాణకే తలమానికంగా నిలిచిన జిల్లా ఓటర్ల నమోదు విషయంలోనూ ముందుంది. నగరానికి ఆనుకుని ఉన్న జిల్లాలో జనాభాతో పాటే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 24,46,265 మంది మాత్రమే ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య రెట్టింపైంది. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 ఏళ్లు నిండిన వారు 35,23,219 మంది ఉన్నారు. వీరిలో 18,22,366 మంది పురుషులు ఉండగా, 16,99,600 మంది మహిళలు ఉన్నారు. మరో 454 మంది ఇతరులు ఉన్నారు. వీరితో పాటు ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 207 మంది ఉండగా, సర్వీసు ఓటర్లు 592 మంది వరకు ఉన్నట్లు అంచనా. 526 పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, ఇక చేవెళ్ల, మొయినాబాద్, కొత్తూరు, షాద్‌నగర్, శంకర్‌పల్లి, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా.
అత్యధిక ఓటర్లు ఇక్కడే..
ఇదిలా ఉంటే.. తెలంగాణలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో శేరిలింగంపల్లి ముందు వరుసలో (6,98,133 ఓటర్లు) ఉండగా, ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన కుత్బుల్లాపూర్ నియోజక వర్గం (6,69,361 మంది ఓటర్లు) ఉంది. మూడో స్థానంలో మేడ్చల్ (5,95,536 మంది ఓటర్లు) ఉండగా, నాలుగో స్థానంలో ఎల్బీనగర్ (5,66,866 మంది ఓటర్లు) ఉంది. ఇక ఐదో స్థానంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం (5,52,455) ఉండటం విశేషం. ఈ ఐదు నియోజకవర్గాల పరిధిలోనే 30 లక్షల మందికిపైగా ఓటర్లు ఉండటం గమనార్హం.
రెచ్చిపోయిన వీధి కుక్కలు
● నలుగురికి గాయాలు
● రెండు మేకలు మృత్యువాత
యాచారం: మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో శనివారం వీధి కుక్కల దాడిలో నలుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎ.మణికుమార్, మంగమ్మ, సునీల్, కృష్ణవేణి తమ వ్యక్తిగత పనుల నిమిత్తం బయట ఉండగా వీధి కుక్కలు వారిపై దాడి చేసి గాయపరిచాయి. మరో ఘటనలో యాచారం గ్రామానికి చెందిన మస్కు యాదయ్య, కొండాపురం యాదయ్యకు చెందిన రెండు మేకలపై దాడి చేసి చంపివేసాయి. రూ.10 వేల చొప్పున నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు
జిల్లాలో..
మంది ఓటర్లు
526 గ్రామ పంచాయతీలు..7,94,653 మంది ఓటర్లు
ఏడు మున్సిపాలిటీలు.. 1,75,974 మంది..
నేడు జాతీయ ఓటరు దినోత్సవం
ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాలు, మండల కార్యాలయాలు, పోలింగ్ బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీ నిర్వహించడం, ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల చేత ప్రతిజ్ఞ చేయించడం, కొత్తగా ఓటరుగా నమోదైన యువతకు ఈ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డులను అందజేయడం, ప్రజాస్వా మ్య పండుగలో భాగస్వాములవుతున్న సీనియర్ సిటిజన్లను సన్మానించడం జరుగుతుందని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఈ వేడుకల్లో ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
35,23,219
35,23,219
35,23,219


