గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి
మాజీ మంత్రి సబితారెడ్డి
శంకర్‌పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఆమె నివాసంలో మాజీ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ దండు సంతోశ్, మహేశ్ సబితారెడ్డి, యువనేత కార్తీక్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, హామీల అమలులో విఫలమైన తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీ గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ శశిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు నర్సింలు, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


