దేవాలయం ధ్వంసంపై ఆందోళన
షాద్‌నగర్: మండల పరిధిలోని కిషన్‌నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనంతో ఢీకొట్టి బంగారు మైసమ్మ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, వీహెచ్‌పీ రాష్ట్ర ప్రముఖ్ మఠం రాచయ్య, బజరంగ్‌దళ్ నాయకులు దేవాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవాలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొంత కాలంగా కొందరు దేవాలయాలను టార్గెట్‌చేశారని, ఆలయాల పరిరక్షణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కక్కునూరు వెంకటేశ్‌గుప్తా, వంశీకృష్ణ, చెట్ల వెంకటేశ్, ఇస్నాతి శ్రీనివాస్, మోహన్‌సిగ్, సురేష్, మహేందర్‌రెడ్డి, మల్చలం మురళి, వెంకటనోళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


