విద్యుత్ ఏఈ కార్యాలయం ప్రారంభం
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి సంబంధించి ట్రాన్స్‌కో ఏఈ కార్యాలయాన్ని డీఈ శ్యామ్‌సుందర్ రెడ్డి ప్రారంభించారు. ఇదివరకు కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ రెండు మండలాలకు ఒకే ఏఈ విధులు నిర్వహించేవారు. అయితే ఇటీవల జిల్లేడ్ చౌదరిగూడ మండలానికి నూతనంగా నర్సింలు అనే ఏఈని నియమించారు. కాగా సోమవారం తాత్కాలిక ఏఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ ఇక నుంచి మండలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఏఈ అందుబాటులో ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో ఏడీ సత్యనారాయణ, కేశంపేట ఏఈ ఈశ్వర్, కొందుర్గు ఏఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


