ప్రజావాణి రద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి రద్దు

Feb 1 2026 10:40 AM | Updated on Feb 1 2026 10:40 AM

ప్రజావాణి రద్దు

ప్రజావాణి రద్దు

ప్రజావాణి రద్దు ఇబ్రహీంపట్నంరూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు, ఫిర్యాదు దారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఎర్రకుంటను సందర్శించిన హైడ్రా అధికారులు 17 నుంచి సర్పంచ్‌లకు రెండో విడత శిక్షణ పట్టుబట్టి.. డాక్టర్‌ పట్టా సాధించి

హయత్‌నగర్‌: వివాదాస్పదంగా మారిన తొర్రూర్‌ ఎర్రకుంట చెరువును శనివారం హైడ్రా అధికారులు సందర్శించారు. చెరువు నిండితే నీరు బయటికి వెళ్లే కాలువను పునరుద్ధరించే క్రమంలో నెలకొన్న వివాదం కోర్టు పరిధిలోకి వెళ్లింది. దీంతో పనులు నిలిచి పోయాయి. న్యాయస్థానం ఆదేశాల మేరకు హైడ్రా ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు హస్సేన్‌, అర్చన చెరువును సందర్శించి కాలువ ఆనవాళ్లను గుర్తించేందుకు పలుచోట్ల జేసీబీతో తవ్వించి చూశారు. నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ డీఈఈ ఆంజనేయులు, ఏఈ శ్రీవాణి, సర్వేయర్‌ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: జిల్లాలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌ మోహన్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం, గ్రామ పరిపాలన అంశంపై శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్టులో ఐదు విడతల్లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో విడతలో ఐదు రోజులపాటు కొనసాగుతుందన్నారు. మొదటి విడత గతనెల 19 నుంచి 23వ తేదీ వరకు పూర్తి చేయడం జరిగిందన్నారు. రెండో విడతలో అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలోని 14 పంచాయతీలు, ఇబ్రహీంపట్నం పరిధిలోని 14 పంచాయతీల సర్పంచ్‌లకు హాల్‌ –1లో, మంచాల పరిధిలోని 23, యాచారం 24, శంషాబాద్‌ పరిధిలోని 21 పంచాయతీల సర్పంచ్‌లకు హాల్‌–2లో 17 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్నారు. మూడో విడతలో భాగంగా ఫరూఖ్‌నగర్‌ 47, కొత్తూరు 12, కొందుర్గు 22, జిల్లెడు చౌదరిగూడ 24 పంచాయతీలకు 23 నుంచి 27వ తేదీ వరకు, నాలుగో విడత మాడ్గుల 34, ఆమనగల్లు 13, తలకొండపల్లి 32, కడ్తాల్‌ 24 పంచాయతీలకు మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు, ఐదో విడత కందుకూరు 35, నందిగామ 19, మహేశ్వరం 30, కేశంపేట 29 పంచాయతీల సర్పంచ్‌లకు మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.

ప్రధాని మోదీ చొరవతో వైద్య విద్య పూర్తి చేసుకున్న షాద్‌నగర్‌ విద్యార్థి

షాద్‌నగర్‌ రూరల్‌: ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగిన ఓ వైద్య విద్యార్థి డాక్టర్‌ పట్టా అందుకుని లక్ష్యాన్ని చేరుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. షాద్‌నగర్‌కు చెందిన జక్కుల సాయిశశాంక్‌ 2018లో వైద్య విద్యను అభ్యసించడానికి ఉక్రెయిన్‌ వెళ్లాడు. మెడిసిన్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న సమయంలో మొదలైన రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థులంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. వీరిలాగే సాయిశశాంక్‌ సైతం ఇంటికి తిరిగి వచ్చాడు. అనంతరం ప్రధాని మోదీ చొరవతో 2023లో తన ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌ను జార్జియా దేశానికి మార్చుకున్నాడు. అక్కడికి వెళ్లి విజయవంతంగా మెడిసిన్‌ పూర్తి చేసి, గత ఏడాది ఆగస్టులో ఇండియా వచ్చాడు. అనంతరం ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ కోసం ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో ప్రిపేరయ్యాడు. జనవరి 17న వరంగల్‌లో పరీక్ష రాశాడు. ఎఫ్‌ఎంజీఈ కోసం 43,915 మంది పరీక్ష రాయగా 10,742 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో మంచి ర్యాంకు సాధించిన సాయిశశాంక్‌ డాక్టర్‌ పట్టా అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement