నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించాలి

Jan 30 2026 10:54 AM | Updated on Jan 30 2026 10:54 AM

నిబంధనలు పాటించాలి

నిబంధనలు పాటించాలి

షాద్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన వివరాలను మున్సిపల్‌ కమిషనర్‌ సునీతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలకు లోబడి అధికారులు విధులు నిర్వర్తించాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి స్క్రూట్నీ, నామినేషన్ల ఉపసంహరణ వరకు ప్రతి విఽషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నామినేషన్‌ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్ల స్వీకరణలో పొరపాట్లకు తావివ్వొద్దు

ఆమనగల్లు: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ల స్వీకరణలో పొరపాట్లకు తావు ఇవ్వొద్దని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌ఓలు, మున్సిపల్‌ కమిషనర్‌ శంకర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి కచ్చితంగా పాటించాలని, నామినేషన్ల స్వీకరణలో అలసత్వానికి చోటు ఇవ్వొద్దని అన్నారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నామినేషన్ల అనంతరం అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల ఫారాలు అందజేసి ప్రతిరోజూ వివరాలు పొందుపరిచేలా అవగాహన కల్పించాలని సూచించారు.

అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement