నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రతిఒక్కరూ బాధ్యతగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అనంతరం అధికారుతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, గ్రామీణాబివృద్ధి అధికారి శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


