శాంతిభద్రతల పరిరక్షణలో రాజీవద్దు
కడ్తాల్: శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడొద్దని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, పుటేజీల నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెట్రోలింగ్‌ను పటిష్టం చేసి, నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ గంగాధర్, ఎస్‌ఐ వరప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు


