సిమెంట్ రంగంలో తిరుగులేని శక్తిగా ‘భారతి’
అబ్దుల్లాపూర్‌మెట్: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ ఫైవ్‌స్టార్ గ్రేడ్ తీసుకువచ్చిందని ఆ సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. పెద్దఅంబర్‌పేటలోని లక్ష్మారెడ్డిపాలెంలో మైత్రి స్టీల్ హౌస్ డీలర్ షాప్‌లో శుక్రవారం తాపీ మేస్త్రీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందన్నారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు మరియు రహదారులకు సరైన ఎంపిక అన్నారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందచేస్తామని స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడుతారన్నారు. ఈ సందర్భంగా బిల్డర్లకి రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను 50 మందికి అందజేశారు. డీలర్ మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ భారతి సిమెంట్ సర్వీస్ వేగవంతంగా ఉంటుందన్నారు.


