కేంద్రం నిధులతోనే అభివృద్ధి
షాద్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, పార్టీ అభ్యర్థు లను గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్య క్షుడు పతంగి రాజ్‌భూపాల్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయ కులు అందెబాబయ్య, శ్రీవర్ధన్‌రెడ్డి, మణికొండ రంగయ్య, చెంది మహేందర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, కక్కు నూరి వెంకటేశ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.


