పట్టు సాగుతో అధిక లాభాలు
యాలాల: పట్టు పురుగుల పెంపకంతో రైతు లు అధిక ఆదాయం పొందవచ్చని హార్టీకల్చర్, సెరీకల్చర్ జిల్లా అధికారులు సత్తార్, నాగరత్న అన్నారు. బుధవారం మండలంలోని బషీర్‌మియా తండాలో పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు హార్టికల్చర్, సెరీకల్చర్ సాగు పట్ల అవగాహన లేకపోవడంతో రైతులు ముందుకు రా వడం లేదన్నారు. తక్కువ సమయంలో ప్రతి నెలా అధిక ఆదాయం పొందేందుకు పట్టు సా గు అవకాశం కల్పిస్తుందన్నారు. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి సబ్పిడీ అందజేస్తుందన్నా రు. బషీర్‌మియాతండా నుంచి ఆరుగురు రైతు లు పట్టు సాగుకు ముందుకు వచ్చినట్లు తెలి పారు.కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వినోద్‌కుమా ర్,రాఘవేంద్ర, తేజశ్విని, నిఖిత,విజయ్‌కుమా ర్,కమల,నర్సింగ్ నాయక్, యూసుఫ్‌జానీ, మాజీ సర్పంచ్ మిత్రునాయక్ పాల్గొన్నారు.


