భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగిరం
ఇబ్రహీంపట్నం రూరల్: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని శక్తిగా భారతి సిమెంట్ ఎదుగుతోందని టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ అన్నారు. శనివారం ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని మంగళ్‌పల్లి సమీపంలోని రోహిణి ట్రేడర్స్ స్టీల్, సిమెంట్ డీలర్ షాపు వద్ద తాపీమేసీ్త్రలకు అల్ట్రాఫాస్ట్ట్ సెట్టింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందన్నారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జి, రహదారుల నిర్మాణాలకు సరైన ఎంపిక అని చెప్పారు. స్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయపడతారని తెలిపారు. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ రూ.20 అధికంగా ఉంటుందన్నారు. అనంతరం 30 మంది బిల్డర్లకు రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లను అందజేశారు. డీలర్లు నర్సింహారావు, విష్ణువర్ధన్‌రావు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్


