ఆదుపుతప్పిన బైక్
ద్విచక్రవాహనదారుడికి తీవ్రగాయాలు
ఆమనగల్లు: బైక్ అదుపుతప్పడంతో ద్విచక్రవాహనదారుడు గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని చుక్కాపూర్ సమీపంలో ఆమనగల్లు–షాద్‌నగర్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. కడ్తాల మండలం ముద్వీన్ గ్రామానికి చెందిన వీరాచారి తలకొండపల్లి–ఆమనగల్లు మార్గంలో ప్రయాణిస్తుండగా చుక్కాపూర్ సమీపంలో అడవిపంది అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో వీరాచారికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం నగరంలోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కేశంపేట: గుర్తుతెలియని వృద్ధురాలు శుక్రవారం మండల పరిధిలోని కాకునూర్‌కు వచ్చింది. ఆమె వివరాలను తెలుసుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా అమె మతిస్థిమితం సరిగా లేక పొంతన లేని సమాధానాలు ఇస్తోంది. వృద్ధురాలిని గుర్తించిన వారు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులు కోరారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
అబ్దుల్లాపూర్‌మెట్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కోహెడా రెవె న్యూ పరిధిలోని మణికంఠ రియల్ ఎస్టేట్ సమీపంలో ఓవ్యక్తి మృతిచెంది ఉన్నాడన్న సమాచారం మేరకు పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి వయస్సు 55–60 ఏళ్ల మధ్య ఉంటుందని, యాచకుడిగా జీవనం సాగిస్తూ అనారోగ్యంతో మృతి చెందినట్లు భావిస్తున్నామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


