బాడీ బిల్డింగ్‌లో నితిన్‌గౌడ్‌కు పతకాలు
తాండూరు రూరల్: మండలంలోని కరన్‌కోట్ గ్రామానికి చెందిన నితిన్‌గౌడ్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో బంగారం, సిల్వర్ పతకాలు సాధించారు. ఈ నెల 23న నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించారు. నితిన్‌గౌడ్ సీనియర్ విభాగంలో సిల్వర్, జూనియర్ క్యాటగిరిలో బంగారం పతకం సాధించారు. వికారాబాద్‌లోని అలీ ఫిట్‌నెస్ జోన్ ట్రైనర్ సద్దాం ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నట్లు నితిన్‌గౌడ్ తెలిపారు. తనను ప్రోత్సహించిన శ్రీనివాస్‌గౌడ్, సచిన్, భరత్, పవన్, సాయిమణికి కృతజ్ఞతలు తెలిపారు.


