క్రీడాపోటీలతో స్నేహభావం పెంపు
ఆమనగల్లు: యువత క్రీడల్లోనూ రాణించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని అయ్యప్పకొండ సమీపంలో నిర్వహిస్తున్న మహేశ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా పోటీల నిర్వహణతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీలు ఉపకరిస్తాయని ఆయన చెప్పారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు యాదవ్, టోర్నీ నిర్వాహకులు సతీశ్, ప్రసాద్, లక్ష్మణ్, స్థానిక నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, అంజినాయక్, ఒగ్గు మహేశ్, రాజు, రంజిత్, సుమన్, కిరణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి


