ఉదయం కాంగ్రెస్.. సాయంత్రం బీఆర్‌ఎస్
ఇబ్రహీంపట్నం: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కొంతమంది నేతలు పార్టీల కండువాలను వేగంగా మార్చేస్తున్నారు. ఉదయం ఒక పార్టీలో, సాయంత్రం మరో పార్టీలో చేరుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధి లోని 21వ వార్డు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి మల్లారెడ్డి శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ, సాయంత్రం తిరిగి బీఆర్‌ఎస్ కండువా కప్పుకొన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎవరు ఎన్ని పార్టీలు మారుస్తారోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
సాయంత్రం బీఆర్‌ఎస్ నేత ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో తిరిగి గులాబీ కండువాతో ..
ఉదయం ఎమ్మెల్యే మల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాతో మల్లారెడ్డి
ఉదయం కాంగ్రెస్.. సాయంత్రం బీఆర్‌ఎస్


