కాంగ్రెస్‌తోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

Jan 30 2026 11:28 AM | Updated on Jan 30 2026 11:28 AM

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

ఆమనగల్లు: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే మున్సిపల్‌ అభివృద్ధి సాధ్యమని ఆమనగల్లు మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ గుర్రం కేశవులు అన్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్ల నామినేషన్ల దాఖలు సందర్భంగా గురువారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రం కేశవులు మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో మున్సిపాలిటీని పాలించిన బీజేపీ ఆమనగల్లు అభివృద్ధిని పట్టించుకోలేదని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు జగన్‌, మానయ్య, ఖాదర్‌ఖాద్రి, పురుషోత్తం, బాబా, మహేశ్‌, ఖాదర్‌, రహీం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఆమనగల్లులో పార్టీ అభ్యర్థులను ఆదరించండి

మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌

గుర్రం కేశవులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement